విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా..జిల్లా స్థాయి సైన్సు నమూనాల ప్రదర్శన

Feb 14,2024 21:25
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా..జిల్లా స్థాయి సైన్సు నమూనాల ప్రదర్శన

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: విద్యార్థుల్ని విజ్ఞానశాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేలా జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ సంయుక్తంగా సైన్సు నమూనా ప్రదర్శన చేపట్టింది. బుధవారం నుండీ ఈనెల 16వ తేది వరకు జిల్లాస్థాయి సైన్సు నమూనాల ప్రదర్శన (జిల్లాస్థాయి ఇన్స్పైర్‌ మనాక్‌ అవార్డు ప్రాజెక్ట్‌ కాంపిటీషన్‌) స్థానిక పిఈఎస్‌ పాఠశాల్లో బుధవారం జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులలో విజ్ఞానశాస్త్ర పరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు రేకెతించి శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇందు కోసం ప్రతిఏటా ప్రభుత్వం విద్యార్థులచే ప్రయోగాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేసి మండల, జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో ఉత్తమ నమూనాలకు ప్రొత్సహాలను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, వాటి సాఫల్యతకు ఊతమిచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డిఎస్‌టి) ఆధ్వర్యంలో ఇన్స్పైర్‌ మనక్‌ అనే పథకాన్ని ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. పాఠశాల స్థాయిలో జిల్లాస్థాయి కార్యక్రమం ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10 నుండి 15 సంవత్సరాల వయసు గల అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో సజనాత్మకత, వినూత్న ఆలోచనలను పెంపొందించడం, విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించడం, శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి విద్యార్థుల్ని పరిశోధనల వైపు ఆకర్షితుల్ని చేయడం, భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన వారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచిన వారిని రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మక ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ వైజ్ఞానిక ప్రదర్శనలలో ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.జిల్లా స్థాయిలో 417 నమూనాలు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సైన్సు నమూనాల ప్రదర్శనకు 417మంది గ్రేడ్‌ టీచర్లతో పాటు సమన్వయ కోసం 20మందితో టీమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి నమూనాల్లో ఉత్తమ నమూనాలను ఎంపిక చేసేందుకు 40 మంది ఉపాధ్యాయులను జడ్జిలుగా నియమించి ఎంపిక చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన నమూనాలను రాష్ట్ర స్థాయిలోనిర్వహించే పోటీల్లో ప్రదర్శిస్తారు. జిల్లా స్థాయి సైన్సు నమూనాల ప్రదర్శనలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు మూడు రోజులు పాటు తాము తయారు చేసిన నమూనాలను ప్రదర్శించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు జిల్లాలో..- రమణ, జిల్లా సైన్సు అధికారి రాష్ట్రస్థాయి ఇన్‌స్పెర్‌ నమూల ప్రదర్శన చిత్తూరు జిల్లాలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు జిల్లా సైన్సు అధికారి రమణ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాని కోరడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మౌళిక వసతులు ఉన్న విద్యాసంస్థలో రాష్ట్రస్థాయి సైన్సు నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అనుమతిస్తే జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ సమన్వయంతో విజయవంతం చేస్తాం. జిల్లా స్థాయి ఇన్స్పైర్‌ మనాక్‌ అవార్డు ప్రాజెక్ట్‌ కాంపిటీషన్‌- దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న సైన్సు నమూనాల ప్రదర్శనకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల నుండీ 417 నమూనాలను ప్రదర్శించడం జరుగుతోంది. బెంగుళూరు- పలమనేరు బైపాస్‌ రోడ్డులోని పిఈఎస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మూడురోజుల పాటు సైన్సు నమూనాల ప్రదర్శన ఉంటుంది. విద్యార్థులు అత్యంత ఉత్సహంగా పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయి.

➡️