సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదు..

Jan 21,2024 22:46
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదు..

ప్ర్రజాశక్తి -బైరెడ్డిపల్లి: తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యమం ఆపేది లేదని అంగన్‌వాడీలు హెచ్చరించారు. తమపై విధించిన ఆంక్షలను నిరసిస్తూ తలపెట్టిన ‘చలో విజయవాడ’కు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి అంగన్‌వాడీలు తరలి వెళ్లారు. బైరెడ్డిపల్లి మండల ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బైరెడ్డిపల్లి టు పుంగనూరు జాతీయ రహదారిలోని తహశీల్దారు కార్యాలయం సమీపాన గల జాతీయ రహదారిలో అంగన్‌వాడీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె 45 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుండగా ఎవరూ పట్టించుకోని కారణంగా రాస్తారోకో చేయాల్సి వస్తోందని ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రత అధికమవుతుందని అంగన్వాడి సిబ్బంది, సిఐటియు, ఐఎఫ్‌టియు సంస్థలు అండదండలతో ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సిబ్బందితో కలిసి రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వెనక్కి తగ్గేదెలేదని, రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండలం ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు

➡️