సమస్యల పరిష్కారానికే.. తొలి ప్రాధాన్యత: ఎంపీపీ

Dec 23,2023 22:34
సమస్యల పరిష్కారానికే.. తొలి ప్రాధాన్యత: ఎంపీపీ

ప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ సరిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్‌ఆర్‌ పురం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వపథకాలను విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లబ్ధిదారులకు గుర్తించాలని అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. కొత్తపల్లి సర్పంచ్‌ డివి.డిల్లెయ్య మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామపంచాయతీలో గల సమస్యలను పరిష్కరించాలని అధికారులను నిలదీశారు. వెటర్నరీ డాక్టర్‌ మాట్లాడుతూ గాలిగుంట వ్యాధులు వ్యాపించడం వల్ల ప్రతిపాడి రైతు టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అధికారులను సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని ఎంపీపీ సరిత అన్నారు. సమావేశంలో ఎంపీడీవో కష్ణయ్య, తహశీల్దార్‌ బెన్నురాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

➡️