స్పందనకు 182 అర్జీలు

Feb 19,2024 21:58
స్పందనకు 182 అర్జీలు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిఆర్‌ఓ బి.పుల్లయ్య పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో స్పందన హాల్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా డిఆర్‌ఓ బి.పుల్లయ్య, నీటి యాజమాన్యసంస్థ, పథక సంచాలకులు ఎన్‌.రాజశేఖర్‌, జెడ్పీ సీఈఓ ప్రభాకరరెడ్డిలతో కలసి జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 182 అర్జీలు అందగా వాటిలో శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 157, సీఈఓ జెడ్పీ1, విద్యాశాఖ1, పోలీసు శాఖ 2, జిల్లా పంచాయతీ 1, డిఆర్‌డిఏ 2, సివిల్‌ సప్లై 2, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 1, సర్వే ల్యాండ్‌ రికాడ్స్‌1, ఇండిస్టీస్‌ 1, సోషల్‌ వెల్ఫర్‌ 1, ఎస్‌ఈ పంచాయతీ రాజ్‌ 1, హౌసింగ్‌ శాఖ1, ఇతరులు 10 ఉన్నాయి. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, వివిధ శాఖల అధికారులకు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

➡️