3న ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

3న ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

3న ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డిప్రజాశక్తి-పూతలపట్టు: పూతలపట్టు మండల పరిధిలోని మూర్తిగనూరు సమీపంలో ఈ నెల 3వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సభ నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన స్థలాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన స్థల ప్రాంగణం ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. ఆయన వెంట ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌ కుమార్‌, నాయకులు మోహన్‌ రెడ్డి, పూతలపట్టు జగదీశ్వర్‌ రెడ్డి, కుమార్‌ రాజా, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

➡️