కాసులకు కష్టాలు…

Apr 4,2024 21:54
కాసులకు కష్టాలు...

శ్రీ వద్ధులకు ఇక్కట్లుశ్రీ పింఛన్‌ కోసం లబ్ధిదారుల పడికాపులుశ్రీ కనీస వసతులు లేక అవస్థలు వికలాంగులు, ఒంటరి మహిళలు, వద్ధులు ఒకరిపై ఆధారపడకుండా తమ జీవనాన్ని కొనసాగించుకోవాలన్న లక్ష్యంతో పింఛన్‌ పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం వేలాది మంది ప్రజలు ఈ పింఛన్‌ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. నేడు పింఛన్‌ తీసుకోవడానికి వద్ధులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల దూరం వెళ్లి సచివాలయాల వద్ద పడి గాపులు పడాల్సి వస్తోంది.ప్రజాశక్తి- పూతలపట్టు గతంలో వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ పంపిణీ చేసేవారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వలంటరీ వ్యవస్థను ఎన్నికల సంఘం దూరం పెట్టింది. దీంతో ప్రభుత్వం పింఛన్లను ఆయా సచివాలయాల పరిధిలో పంపిణీకి శ్రీకారం పుట్టింది. దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్‌చైరుకు పరిమితమైన తదితరులకు ఇంటి వద్ద ఇస్తారని.. మిగిలిన వారు సచివాలయాలకు రావాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు లబ్ధిదారులు సచివాలయాలకు ఉదయాన్నే వెళ్లి పడి కాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస సౌకర్యాలు లేక ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కొన్నిచోట్ల తాగునీరు కనీస కుర్చీలు లేక వద్ధులు పడినకష్టాలు వర్ణణాతీతం. సచివాలయాల మెట్లు ఎక్కలేక దిగలేక వద్ధులు అవస్థలు పడ్డారు. పూతలపట్టులో… పూతలపట్టు మండలంలో 25 పంచాయతీలు 256 గ్రామాలు 17 సచివాలయాలు ఉన్నాయి. కొన్నిచోట్ల సచివాలయాలకు 5,6 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంది. నగదు అత్యవసరమైన పలువురు వద్ధులు వందల రూపాయలు ఖర్చుపెట్టి తమవెంట ఒకరిని పిలుచుకొని ఆటోలోను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 8473 మందికి లబ్ధిదారులు ఉండగా… సుమారు రూ.2.42 లక్షల నగదును పంపిణీ చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నాటికి 76శాతం పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం మండలంలో పూర్తవుతుందని అంటున్నారు.ఇబ్బందులు పడాల్సి వస్తోంది..- ఆనందయ్య, పింఛన్‌ లబ్ధిదారుడు గతంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి ఉదయానికల్లా పింఛన్లు ఇచ్చేవారు. ఐదు కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లి గ్రామం నుంచి వచ్చాను. సమయానికి ఆటోలు అందుబాటులో లేకుండా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో లాగానే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలి. శుక్రవారం పూర్తి చేస్తాం..- ప్రసన్న కుమారి, ఎంపీడీవో, పూతలపట్టు. వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వద్ధులకు ఆయా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే 76శాతం పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. లబ్ధిదారులకు సచివాలయాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

➡️