పంట పొలాలపై ఏనుగుల దాడి

May 18,2024 17:00 #Chittoor District

ప్రజాశక్తి -(సోమల) సదుం: సదుం మండలం జోగి వారి పల్లి పంచాయతీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఐరాల మండలం నుండి వచ్చిన ఏనుగుల గుంపు వరి మామిడి టమోటా పంటలపై దాడి చేసి పంట పొలాల చుట్టూ వేసిన రక్షణ కంచెలను ధ్వంసం చేసి డ్రిప్ పైపులను తొక్కి వేసి తీవ్ర నష్టం చేసినట్టు రైతులు నరసింహారెడ్డి రెడ్డప్ప రెడ్డి, సురేష్ రెడ్డి, రఘు తదితరులు తెలిపారు. బత్తల వారి పల్లి జోగి వారి పల్లి పరిసర ప్రాంతాలలో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాల పై దాడి చేస్తూ తీవ్రంగా రైతులకు నష్టం కలిగిస్తున్నాయని ఏనుగుల బారి నుండి పంటలను అటు రైతులను కాపాడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

➡️