ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 4,2024 17:55 #Chittoor District
  •  డి ఆర్ డి ఎ పిడి 

ప్రజాశక్తి-చిత్తూరు : హక్కు కలిగిన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డి ఆర్ డి ఎ పిడి తులసి తెలిపారు. సోమవారం  జిల్లా సమైక్య ఆధ్వర్యంలోఓటు హక్కు వినియోగంపైచైతన్య ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పిడి  మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన వారుఅందరూ కచ్చితంగా ఓటు హక్కు కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటు హక్కును  వినియోగించుకొని అత్యధిక శాతం ఓటు వినియోగం జరిగేటట్లు మన సంఘ సభ్యుల ద్వారా అవగాహన కల్పించాలనన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఓటు హక్కును వినియోగించు కావడంతో పాటు గా ఇతర  ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తులు కూడా  ఓటు హక్కు వినియోగించు కునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ ర్యాలీలో డిపిఎంలు వెంకటేష్ రవి తదితరులు పాల్గొన్నారు.

➡️