4న తొలి ర్యాండమైజేషన్‌

Apr 3,2024 22:33
4న తొలి ర్యాండమైజేషన్‌

శ్రీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఉత్తర్వులు జారీ శ్రీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి విధుల కేటాయింపుకు సంబంధించి ఈనెల 4వ తేదీన తొలి ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు తొలి ర్యాండమైజేషన్‌లో పిఓ, ఏపీఓ, ఓపిఓలకు విధుల కేటాయింపులో భాగంగా సంబంధిత నియోజకవర్గం, మండలాలను కేటాయించడం జరుగుతుందన్నారు. పిఓలుగా ఉపాధ్యాయులు, ఈఈలు, డీఈలు నియామకం కాబడ్డారని, ఏపీఓలు, ఓపిఓలుగా ఇతర సిబ్బందిని నియామకం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉంటుందని, హోం ఓటింగ్‌ నిర్వహణపై కసరత్తు జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను ప్రోత్సహిస్తున్నారని, ఈఅంశంపై ప్రత్యేక దష్టి సారించాలని, నగరి నియోజకవర్గం విజయపురం మండలం పాత ఆర్కాట్‌కు చెందిన రాజేశ్వరి, సురేష్‌, మహారాజపురం ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌ మెన్‌గా పనిచేస్తున్న దేవరాజులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వీరిపై చర్యలు తీసుకోవాలని, సామాజిక పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి దష్టికి తీసుకొని రాగా … ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేసి పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ బి.పుల్లయ్య, కాంగ్రెస్‌ ప్రతినిధి పి. భాస్కర్‌, పరదేశి, టిడిపి ప్రతినిధులు సురేంద్ర కుమార్‌, కొండయ్యలు, వైసిపి ప్రతినిధి సూర్యప్రతాప్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️