పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత

Jun 5,2024 15:07 #Chittoor District

ప్రధానోపాధ్యాయురాలు కుసుమాంబ

ప్రజాశక్తి – సోమల : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా విడనాడితే మానవాళికి మంచి రోజులు వస్తాయని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంజంపేట ప్రధానోపాధ్యాయురాలు కుసుమాంబ అన్నారు. బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశానుసారం నిర్ణయించిన తేదీలలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు వివరించడం ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️