రోడ్డు ప్రమాదంలో సరకల్లు ఏఎన్ఎం మృతి

May 27,2024 13:29 #Chittoor District

ప్రజాశక్తి-తవణంపల్లి : తవణంపల్లి మండలం సరకల్లు సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వరలక్ష్మి.. తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంలో తవణంపల్లి నుంచి సరకల్లు వెళుతుండగా.. మత్యం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడం జరిగింది. దీంతో అదుపుతప్పి కిందపడటంతో వరలక్ష్మి తలకు బలమైన గాయం అయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది.

➡️