‘ఎస్‌ బాస్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి

Jun 25,2024 19:25 #havish, #movie

నిర్మాత, కె.ఎల్‌.యూనివర్సిటీ చైర్మన్‌ కొనేరు సత్యనారాయణ కె స్టూడియోస్‌ బ్యానర్‌పై ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ సినిమాలు తీసిన విషయం తెలిసిందే. తాజా చిత్రం ‘ఎస్‌ బాస్‌’ను రూపొందిస్తున్నారు. కాంచన కోనేరు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హవీష్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హవీష్‌, ‘రామ్‌ లీల’, ‘జీనియస్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. దర్శకుడు అశోక్‌ ‘ఎస్‌ బాస్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంగళవారం హవీష్‌ పుట్టినరోజు సందర్భంగా ఎస్‌ బాస్‌ చిత్రం నుంచి హవీష్‌ స్టైలిష్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. రచయిత ఆకుల శివ ఈ చిత్రాన్ని కథ, మాటలను అందించారు. బ్రహ్మానందంకీలక పాత్రను పోషించారు. కబీర్‌ లాల్‌ సినిమాటోగ్రఫీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

➡️