ఆత్మలింగేశ్వరుడుకి ప్రత్యేక పూజలు

Mar 9,2024 12:45 #Chittoor District

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : పుల్లూరు క్రాస్ నందు వెలసిన పల్లేరు కాయల కోనలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఆత్మ లింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పుల్లూరు క్రాస్ నందు వెలసిన పల్లేరు కాయల కోనలో శనివారం మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ పూజారి ముందుగా స్వామివారికి పాలాభిషేకం, బిల్వార్చన, హోమము, పూలమాలలతో అలంకరించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగిన పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. దేవదేవుని దర్శించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అక్కడికి విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్వామల మోహన్ నాయుడు పరిసరాల ప్రాంత భక్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️