సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలివర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలివర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలివర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌: ప్రజా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు నిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి ని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిపఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాత, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి నేటి రాజకీయాలకు ఆదర్శంగా నిలిచి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించిన ప్రజానేత పుచ్చలపల్లి సుందరయ్య మచ్చలేని మహానీయుడు అన్నారు. భారతదేశ తొలి ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య పేదలందరికి అన్నం పెట్టే మార్గం ఎంచుకున్న మహానేత అని, తనకున్న వందల ఎకరాల సాగు భూమిని కడుపేదలకు పంచి, నిరుపేదగా జీవించిన పేదల ప్రేమ మూర్తి అని పేర్కొన్నారు. తన గ్రామం నుండి నెల్లూరు సైకిల్‌ , కావడిపై సరుకులు తెచ్చి లాభం లేకుండా అసలు ధరలకు అమ్మేవారని, వ్యవసాయ కూలీల కోసం సంఘం పెట్టి కూలీ రేట్లు సాధించారన్నారు. సమాజంలో ఉన్న కుల వివక్ష తమ ఇంటిలో లేకుండా చెయ్యడమే కాకుండా బయట వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపి ప్రజలలో చైతన్యం కల్పించారన్నారు. ప్రజాప్రతినిధి గా సైకిల్‌ పై పార్లమెంట్‌ కు వెళ్లి తన నిరాడంబరతను చాటిన నిజాయతీ పరుడు. తెలంగాణా విముక్తి కోసం సాగించిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. ఆ ఉద్యమానికి రథసారధి అయ్యారని, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అగ్రభాగాన నిలిచి , నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఉద్యమించారన్నారు. కార్మిక హక్కుల కై, ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కు, కనీస వేతనం అమలుకు, కార్మిక సంక్షేమానికి ఉద్యమించటం మన ముందున్న అసలు కర్తవ్యం అన్నారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజా కార్మిక సమస్యలపై బలమైన ప్రజా ఉద్యమం చేయడమే లక్ష్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు. అనంతరం సుందర య్య చిత్ర పటానికి పూల మాలల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు కె సురేంద్రన్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, దాము, ప్రసాద్‌, శివ, లోకానాధం, అయ్యప్ప, రమాకాంత్‌ పాల్గొన్నారు.

➡️