దగా డీఎస్సీ

Feb 3,2024 14:37 #Chittoor District
tdp leader on dsc

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోందని తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గం ఇంచార్జ్ మురళీమోహన్ అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో డీఎస్సీ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే 6000 పోస్టులు భర్తీ చేసేలా మెగా డీఎస్సీ ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు. విద్యావేస్థను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కోదండ యాదవ్, తెలుగు విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వ పాల్గొన్నారు.

➡️