ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తా..తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్

ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తా..తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్

ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తా..తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిప్రజాశక్తి -తిరుమల: తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తానని రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలసికట్టుగా నడుస్తామన్నారు. రెండు రాష్ట్రాల అభివద్ధికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు. రాజకీయాలపై విలేకర్లు ప్రశ్నించగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకుని దేశ సంపదను పెంచాలని తమ ఆలోచన అని తెలిపారు.

➡️