ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి వేతనం చెల్లించాలి – సిఐటియు జిల్లా కార్యదర్శి బి. మనోహర్‌

ప్రజాశక్తి -జమ్మలమడుగు రూరల్‌ తక్షణమే ఎన్నికల విధులలో పాల్గొన్న కిందిస్థాయి సిబ్బందికి వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి. మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక పాత బస్టాండ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను రెవెన్యూచ పోలీస్‌ వారు ఇతర వర్గాల వారందరినీ కలుపుకొని విజయవంతంగా నిర్వహించారన్నారు. అందుకు అభినందనలు తెలిపారు. ఎన్నికలు విజయవంతం కావడంలో విఆర్‌ఎలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్‌ వర్కర్లు, గ్రీన్‌ అంబాసిడర్స్‌ ల పాత్ర ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఇవిఎంలను తీసుకెళ్లడం, పెట్టడం, మళ్లీ తేవడం, అక్కడి నుంచి వెహికిల్‌లోకి ఎత్తడం, వాటిని ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రానికి తరలించే వరకు విఆర్‌ఎల పాత్ర గణనీయమైంన్నారు. ఆశా వర్కర్లు పోలింగ్‌ బూత్‌ వద్ద ప్రథమ చికిత్స కోసం విధులు నిర్వహించారన్నారు. అంగన్వాడీ సిబ్బందిని సహాయకులుగా ఉపయోగించుకున్నారని, మున్సిపల్‌ వర్కర్స్‌, గ్రీన్‌ అంబాసిడర్స్‌ లను పోలింగ్‌ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. కమలాపురం, కడప, పెద్దముడియం, జిల్లాలోని మరి కొన్ని మండల కేంద్రాలలోని పని చేసిన విఆర్‌ఎలకు, అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు, మున్సిపల్‌ కార్మికులకు వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కిందిస్థాయి వారిపై ఉన్నత స్థాయి వారు వారికి శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఎన్నికల సమయంలో కష్టపడినటువంటి సిబ్బందికి తగిన జీతం లేదా వేతనాన్ని ఇప్పించేందుకు కషి చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, సిఐటియు విజరు, సిపిఎం కమిటీ సభ్యులు వినరు, విజరు కుమార్‌, ఆదామ్‌ పాల్గొన్నారు.

➡️