కార్మికుల సంఖ్య పెంచాలని కమిషనర్‌కు సిఐటియు వినతి

Feb 20,2024 15:12 #anaathpuram

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచుతామని పాలకవర్గం అధికారులు నిలవధిక సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిల్‌ సాధారణ సర్వసభ్య సమావేశం అజెండాలో చేర్చి ఆమోదించాలని కోరుతూ మంగళవారం కమిషనర్‌ మేఘ స్వరూప్‌కు మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు వినతిపత్రం అందజేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పారిశుద్ధ్యం, ఇంజనీర్‌ సెక్షన్‌ విభాగంలో కార్మికుల సంఖ్య పెంచాలని అదనంగా పనిచేస్తున్న కోవిడ్‌ మలేరియా గార్బేజ్‌ కార్మికులకు 15,వేల రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల జరగబోవు కౌన్సిల్‌ సమావేశంలో అజెండాగా చేర్చాలని కోరారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 16 రోజుల సమ్మె పోరాటంలో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌ , డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మి , అడిషనల్‌ కమిషనర్‌ రమణారెడ్డి , హెల్త్‌ ఆఫీసర్‌ సంఘం శ్రీనివాస్‌ తదితరుల సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా పారిశుద్ధం, ఇంజిన్‌ సెక్షన్‌ విభాగం సంబంధించి, కార్మికుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. అలాగే అదనంగా పనిచేస్తున్న కోవిడ్‌ మలేరియా గ్యారేజ్‌ కార్మికులకు 15,వేల రూపాయల వేతనంతో టీఎల్‌ ఆఫీస్‌ ద్వారా ఒకటే చెక్కు రూపంలో అందరికీ వేతనాలు అందజేస్తామని మినిట్స్‌ కాపీలో పొందుపరచడం జరిగినది ఇప్పుడు జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అందువలన కమిషనర్‌ దృష్టికి తీసుకు వచ్చి కార్మికులకు తగు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. కమిషనర్‌ స్పందిస్తూ ఈ నెలలో జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో కార్మికుల సమస్యల పైన చర్చలలో ఇచ్చిన హామీల లో భాగంగా అజెండగా పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ లీడర్‌, ఎక్స్‌ ఎన్‌ నెంబర్‌ నారాయణస్వామి పాల్గొన్నారు.

➡️