27న ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి నాయకులతో సిఎం జగన్‌ సమావేశం

Jan 20,2024 16:01 #ap cm jagan, #vijayanagaram, #visited
  •  వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 27న ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సిఎం జగన్‌ సమావేశం కానున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం ద్వారానే సమా సమాజం స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తి సిఎం జగన్మోహన్‌ రెడ్డి అని అనారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తయిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించి స్మృతి వనం ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌ ది అని పేర్కొన్నారు. పండగ వాతావరణంలో రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనసంద్రోహం మధ్య 206 అడుగుల డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసారు. సీఎం జగన్‌ ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ స్మతి వనాన్ని ప్రజలందరూ సందర్శించి అంబేద్కర్‌ భావజాలాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వైసిపి నాయకులు, కార్యకర్తలతో రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించడానికి సన్నద్ధమయ్యారని తెల్పారు. మొదటిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈనెల 27వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్నారన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవ్వాలని పిలుపునిచ్చారు.

➡️