వెలిగొండ ఇంటేక్‌ వెల్‌ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

వెలిగొండ (ప్రకాశం) : వెలుగొండ ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా దృష్టిసారించారు. మంగళవారం వెలిగొండ ఇంటేక్‌ వెల్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణ స్థితిగతులను కలెక్టర్‌కు అధికారులు వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే నీటిని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

➡️