‘ఉత్తరం’లో కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం

May 11,2024 00:21 #congress pracharam
Congress, pracharam

 ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు శనివారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రం సర్వ నాశనమైందన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొండవాలు ప్రాంతంలో వర్షాలు పడేటప్పుడు కొండ చరియలు విరిగి ఇళ్ల మీద పడుతూ పలువురు మృతిచెందిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీటికి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి హంసలేఖ, సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️