కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటింటా ప్రచారం

Apr 30,2024 21:41

 ప్రజాశక్తి – వేపాడ : మండల కేంద్రమైన వేపాడ, వల్లంపూడి గ్రామాలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గేదెల తిరుపతి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు, ఎమ్‌పి అభ్యర్థి సత్యనారాయణ రెడ్డికి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ రోజుకి కనీసం రూ.400 వేతనం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️