ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి

Dec 12,2023 16:55 #Kurnool

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు): ఈనెల 15,16,17 తేదీల్లో కర్నూలులో జరుగుతున్న ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను,డిసెంబర్ 15 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు పాత బస్టాండ్లో జరుగుతున్న బహిరంగ సభను,జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే.వేంకటేశులు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలం పరిధిలో పెద్దతుంబలం,దొడ్డనకేర్ గ్రామాల నుండి నుండి జాతను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,దేశ నలుమూలల నుండి వందలాదిమంది,ఉద్యమ నాయకులు,రైతు ప్రతినిధులు, కర్నూలులో మూడు రోజులు పాటు కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొంటున్నారని,ఈ సందర్భంగా రైతుల గిట్టుబాటు ధర, రుణమాఫీ, విద్యుత్ సవరణ చట్టం, మరియు రాష్ట్రంలో ప్రాజెక్టులు కరువు సమస్యలపై చర్చిస్తారని, అలాగే డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వేలాది మందితో గొప్ప బహిరంగ సభ కూడా జరుగుతుందని ఈ బహిరంగ సభకు కేరళ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బాలగోపాల్,ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ నాయకులు అశోక్ దావలే, హన్నన్ మొల్ల, విజ్జు కృష్ణన్ పాల్గొని ప్రసంగిస్తారని,కావున జిల్లాలోని రైతాంగం మొత్తం పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.ఈ జాత మండలంలోని అన్ని గ్రామాలలో కవర్ చేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ జాతాలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కే.శేఖర్,బి.అయ్యప్ప, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు జే.రామాంజనేయులు,బి.వీరారెడ్డి, కెవిపిఎస్ మండల అధ్యక్షులు మునిస్వామి, డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు.

➡️