ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Nov 26,2023 13:07 #Bapatla District, #Special Days
constitution day in devangapuri

ప్రజాశక్తి – చీరాల : చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలో గ్రామ కార్యదర్శి బండారు మురళి బాపూజీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం భారత రాజ్యాంగంలో స్తంభాలని కొనియాడారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటంనకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు వీఆర్వో జయ బాబు, ఓబీసీ నాయకులు నాసిక శివాజీ, బొడ్డు లలిత కుమార్, బుద్ది కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ గుడిమీ సంజీవ్ కుమార్, లేళ్ళ వంశీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️