ఉండవల్లి-సీతానగరం ప్రాంతాల్లో సిపిఎం ప్రచారం

మంగళగిరి (గుంటూరు) : ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్న శివ శంకర్‌ ఉండవల్లి, సీతానగరం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️