అరిగెల శ్రీనివాసరావుకు సిపిఎం నాయకుల నివాళి

May 22,2024 17:46 #ntr district

ప్రజాశక్తి-చందర్లపాడు : వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ మామగారైన అరిగెల శ్రీనివాసరావు (60) మంగళవారం రాత్రి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురై మతి చెందారు. అరిగెల శ్రీనివాసరావు మతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కౌలు రైతు సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, సిపిఎం నందిగామ డివిజన్‌ కార్యదర్శి కటారపు గోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఖాసిం సిపిఎం చందర్లపాడు శాఖ కార్యదర్శి అరిగెల చిన్న శ్రీనివాసరావు, సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️