నాదెళ్ల భాస్కరరావు కు సిపిఎం నాయకుల నివాళి

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు నాదెండ్ల చెన్నకేశవరావు తండ్రి నాదెళ్ల భాస్కరరావు ఇటీవల కాలంలో మృతి చెందారు. కాగా సోమవారం సిపిఎం నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి, ఉయ్యూరు కృష్ణారెడ్డి ప్రముఖ సామాజిక వేత్త చాట్ల విజయకుమార్‌ కలిసి భాస్కరరావు చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాదెళ్ల చెన్నకేశవరావు ను ఓదార్చారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు భాస్కరరావు చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు.

➡️