మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 30,2024 13:59 #campaign, #cpm, #Mangalagiri

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా బ్లాక్‌ వేదిక తరపున సిపిఎం అభ్యర్థిగా జన్న శివ శంకర్‌ రావు, గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ విజయాలను కాంక్షిస్తూ మంగళవారం మంగళగిరి పట్టణంలోని కుప్పురావ్‌ కాలనీ, 28 వార్డుల్లో విస్తఅత ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. ఈ మేరకు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అసెంబ్లీకి సుత్తి పొడవైన నక్షత్రం, పార్లమెంటుకు కంకి కొడవలి గుర్తులకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. మతోన్మాద బిజెపిని దాని మిత్రులను, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దళితుల సమస్యలు పరిష్కరించడంలో అధికార వైసిపి విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు పి బాలకఅష్ణ, డి రామారావు, సిపిఎం పట్టణ నాయకులు గోలి దుర్గాప్రసాద్‌, ఎస్‌ నరసింహారావు, కే ఏడుకొండలు, టి హేమ సుందర్‌ రావ్‌, షేక్‌ కాసిం వలి, యశ్వంత్‌, ఎస్‌ కోటేశ్వరరావు, ఈ విజయలక్ష్మి, ఎన్‌ వెంకటేశ్వరరావు, బి స్వామినాథ్‌, ఎం కిరణ్‌, కే ఆంజనేయ రెడ్డి, నికల్సన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️