తెలంగాణ కంటే వెనుకబాటులో ఏపీ అభివృద్ధి : సిపిఎం

Apr 8,2024 00:33

మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-తాడేపల్లి :
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృ ద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. తాడేపల్లిలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జరిగిన ఎన్నికలను అసాధారణ ఎన్నికలతో పోల్చారు. ఈ ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎ మిత్ర పక్షాలను ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు. కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం, ఆప్‌ వంటి పార్టీలు బలపరిచిన ఇండియా బ్లాక్‌ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకరరావు, పార్లమెంటు అభ్యర్థి జంగాల అజరుకుమార్‌లను గెలిపించాలని కోరారు. రాజధానిని ముక్కలు చేస్తుంటే ఇది తప్పు అని జగన్‌కు మోడీ చెప్పలేకపోయాడని విమర్శించారు. పార్లమెంట్లో రాజధాని చట్టం చేసిన 12 అంశాలు అమలు జరిగితే ప్రతి సంవత్సరం రూ.రెండున్నర లక్షల కోట్ల ఆదాయం సమకూరే దన్నారు. ఈ రకంగా రూ.25 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిం దన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పోరాటం చేయలేని జగన్‌ చంద్రబాబులను నమ్మి మోసపోవద్దని ప్రజల్ని కోరారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అభివృద్ధి వైపు పయనించాలంటే ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️