550 ఎకరాల్లో నీట మునిగిన వరి చేలు

Dec 6,2023 16:17 #Konaseema
crop damage in ramachandrapuram

2,800 మెట్రిక్ టన్నులు ధాన్యం నీటమునక
11 50 ఎకరాలు కోతలు పూర్తికాని చేలు

ప్రజాశక్తి-రామచంద్రపురం : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కే గంగవరం మండలంలోని 550 ఎకరాలు వరిచేలు నీట మునిగిపోయాయి. అదేవిధంగా మాసూలు చేసి నిలువ చేసుకున్న ధాన్యం 2,800 మెట్రిక్ టన్నులు ధాన్యం నీట మునిగి ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి బి రవి తెలిపారు. పామర్రు హైస్కూల్ వద్ద, కూళ్ళ గ్రామంలోనూ రైతన్నలు నిలవ చేసుకున్న ధాన్యం ముంపున గురైంది. మండలంలో మరో 1150 ఎకరాలు వరి కోత కోయాల్సి ఉందని అధికంగా శివల, ఎర్ర పోతవరం, గుడిగళ్ల, దంగేరు, పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని ఆయన వివరించారు. తడిసిన ధాన్యాన్ని ఉప్పు, ఊకతో, కలిపి ఉంచడం వల్ల మొ లకలు రాకుండా ఉంటుందని అదేవిధంగా పడిపోయిన వరిచేలకు కళ్ళు ఉప్పు చల్లుకోవడం ద్వారా మొలకలు రాకుండా పంటను కాపాడుకోవచ్చని సూచించారు. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రూ 1400 కొనుగోలు చేస్తుందని, ఉబ్బడాలు ధాన్యంగా పిలవబడేదాన్ని బయట 1300కే దళారులు కొనుగోలు చేస్తున్నారని, ఉబ్బడాలు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మి రూ. 1400 చొప్పున పొందవచ్చని వ్యవసాయ అధికారి రైతులకు తెలియజేశారు.

➡️