సాగుదారులకు భూ హక్కు కల్పించాలి

Apr 15,2024 22:02

ప్రజాశక్తి – కొమరాడ : తాత, ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూమికి హక్కు కల్పించాలని ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దుగ్గికి చెందిన రైతులు న్యాయం చేయాలను కోరుతూ స్థానిక తహశీల్దార్‌ రమేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం దాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సిఐటియు జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ మండలంలోని దుగ్గికి చెందిన 21 మంది రైతులు తమ తాత ముత్తాతల నుంచి 23 ఎకరాలు భూమి చేసుకున్న సందర్భంలో వీరి భూమికి సంబంధించిన పాసుబుక్కులు, 1-బిలు, అడంగల్‌ ఉన్నప్పటికీ సచివాలయానికి వెళ్లి చూడగా వన్‌-1, అడంగల్‌ బ్లాక్లిస్టులో ఉన్న పరిస్థితి ఉందన్నారు. గమనించి ఆశ్చర్యాన్ని గురయ్యే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో గడిచిన కొన్ని నెలల క్రితం వీరి 1-బి బ్యాక్‌ లిస్టులో పెట్టడం జరిగిందని, ఇది చాలా అన్యాయమని అన్నారు. ఇలాంటి సందర్భంలో రెవెన్యూ యంత్రాంగంతో పాటు పార్వతీపురంలో కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ భూ రికార్డులు తారుమారు చేయగా, బాధితులు కోర్టు నుంచి సంబంధిత కాగితాలు తెచ్చుకున్నారన్నారు. అయితే ప్రత్యర్థులు తమ భూములంటూ మంది రైతులను భయపెడుతున్నార న్నారు. కావున వెంటనే స్థానిక తహశీల్దార్‌ ఈ భూములపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలు తేల్చి బాధిత రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గీ గ్రామానికి చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు.

➡️