ఆరుగాలం పండిన పంట వర్షార్పణం

Dec 4,2023 15:06 #Cyclone, #East Godavari
cyclone effects in peravali

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని వరి కోతలు కోత దశలో ఉన్నవి ప్రస్తుతం కానూరు ఉసులుమర్రు తీపర్రు తదితర గ్రామాల్లో విత్తన కోతలు రైతులు కోసారు 35 శాతం వరకు మాసూళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఈదురు గాలులు ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు పంట పండి కోత కోసే సమయానికి తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వర్షాలకు గింజ రాలి రెల్లవిరిగి పంట చేలు పడిపోవడంతో పంట కోత సమయం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు గింజ రాలి దిగుబడి భారీగా తగ్గిపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది అనుకునే సమయానికి తుఫాన్ ప్రభావంతో రైతుకు భారీగా నష్టం వస్తుందని అంటున్నారు. కళ్ళ ఎదుట చేతు కందిన పంట భారీ వర్షాలకు ఈదురు గాలులకు పడిపోతుందన్నారు. మరొకపక్క తుఫాన్ ప్రభావంతో రైతులందరూ మిషన్లతో కోతలు కోయటంతో మిషన్ల కొరతతో ఎక్కువ ఉంది. ఆరుగాలం పండించిన పంట తుఫాను బారిన పడినదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో ఎక్కువమంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. భారీ వర్షాల ప్రభావంతో నష్టం వాటినే ప్రమాదం ఉందని అధికారులు నాయకులు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

➡️