ఈదురుగాలులతో నేలకొరిగిన దాళ్వా వరిచేలు

Mar 21,2024 17:31 #Konaseema

ప్రజాశక్తి – రామచంద్రపురం : బుధవారం కురిసిన అకాల వర్షం ఈదురు గాలులకు పలు దాళ్వా వరి చేలు నేల కొరిగాయి. ప్రస్తుతం దాల్వాపరిచేలు పొట్ట దశను దాటి ఈనిక దశకు చేరుకున్నాయి. వాతావరణం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకస్మికంగా ఈదురుగాళ్లు వర్షం కురవడంతో రైతన్నలు ఆందోళన గురయ్యారు. అయితే పలుచోట్ల వరి చేలు నేలకొరకడంతో రైతన్నలు విచారం వ్యక్తం చేస్తున్నారు. దాల్వా పంటలకు రైతన్నలు తొలకరి కంటే అధికంగా పెట్టుబడులు పెడతారు. ప్రస్తుతం ఎంతో ఆశయానకంగా వరిచేలు ఉన్నాయి మరో నెలలో దాల్వా వరి కోతలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా మే నెలలో తుఫానులు సంభవించి రైతులకు పంట నష్టం పాలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు వాతావరణం రైతులకు అనుకూలించింది. బుధవారం వర్షాలకు అక్కడక్కడ వరిచేలు నేలకొరిగిన భారీ నష్టాలు సంభవించలేదు. మరో నెల రోజులు గడిస్తే దాల్వా రైతులు గట్టెక్కే అవకాశం ఉంది. ఈసారి వాతావరణం రైతులకు అనుకూలిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

➡️