ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకలు

Dec 9,2023 15:49 #East Godavari
disable pesons day

ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం ఎంపిపి నెంబర్ 1 పాఠశాలలో గల భవిత కేంద్రం నందు శనివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులు పట్ల ప్రేమ, అనురాగం, శ్రద్ధ, ప్రోత్సాహం ఉంచాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలైన దివ్యాంగులకు బహుమతులు గ్రామ పెద్దల చేతుల మీదగా అందించారు.ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ ఆర్.ఎస్.ఎన్ మూర్తి, మండల విద్యాశాఖ అధికారులు వి లజపతిరాయ్, వై నాగేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.లక్ష్మణ్ కుమార్, ఐఈఆర్టీ టీచర్లు కృష్ణవేణి, లోవ కుమారి, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️