పొగొట్టుకున్న సెల్‌ ఫోన్లు అందజేత

ప్రజాశక్తి-కనిగిరి : పిసిపల్లి మండలం గుదేవారి పాలెం గ్రామానికి చెందిన శ్రీనివసరావు అనే వ్యక్తి తమ గ్రామానికి వచ్చేందుకు గుంటూరులో కనిగిరి డిపోకు సంబంది óంచిన ఆర్‌టిసి బస్సులో ఎక్కాడు. అనంతరం కనిగిరిలో బస్సు దిగి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా కనిగిరిలోని ఒక ప్రవేట్‌ హాస్పిటల్‌ కు వెళ్లి చికిత్స చేయించ ుకున్నాడు. అనంతరం యాపిల్‌, రెెడ్‌మి, కళ్ళజోడును ఎక్కడో మర్చిపోయినట్లుగా గమనించాడు. చివరకూ తాను ప్రయాణం చేసిన బస్సులో మరచిపోయినట్లుగా నిర్ధారించు కున్నాడు. మరో వ్యక్తి ఫోన్‌ తీసుకొని తన ఫోన్‌కు కాల్‌ చేశాడు. దీంతో బస్సులో సెల్‌ ఫోన్‌ రింగ్‌ అవడం గమనించిన పార్కింగ్‌ డ్రైవర్‌ ఆఫోన్‌ ను తీసుకోని సెక్యూరిటీ పాయింట్‌లో విధి నిర్వహణలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌. కొండయ్య అందజేశాడు. అనంతరం బాధితుడితో ఫోన్‌లో మాట్లాడి బస్సులో తనిఖీ చేయగా మరొక సెల్‌ ఫోను, కళ్ళజోడు సీట్ల మధ్య ఉండడం గమనించి సెక్యూరిటీ పాయింట్‌లో భద్రపరచారు. బస్సులో దిగిపోయిన ప్రయాణికుడి తండ్రి వెంకటేశ్వర్లు డిపో వద్దకు వచ్చి బస్సు వివరాలు టిక్కెట్‌ వివరాలు తెలిపాడు. కళ్ళజోడు,రెండు ఫోన్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌. కొండయ్య ఆయనకు అప్పగించాడు. విలువైన వస్తువులు తిరిగి అప్పగించినందుకు ప్రయా ణికుడు తండ్రి వెంకటేశ్వర్లు డిపో మేనేజర్‌ ,హెడ్‌ కానిస్టేబుల్‌, ఆర్‌టిసి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మెకానిక్‌ నజీర్‌ బాషా, పార్కింగ్‌ డ్రైవర్‌ పాల్గొన్నారు.

➡️