డెంగీపై అవగాహన ర్యాలీ

May 16,2024 23:26 #dengue, #Rally
Dengue , rally

ప్రజాశక్తి-యంత్రాంగం ఆనందపురం : ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్భంగా చందక గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు మాట్లాడుతూ, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలంతా కృషి చేయాలని కోరారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారమూ డ్రై డే పాటించాలని సూచించారు. క్షయ వ్యాధి టీకాల కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ నిర్మల గౌరి మాట్లాడుతూ, లార్వా దశలోనే దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్‌ పుర్ణేంద్రబాబు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఉమావతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్‌ ఎం.గంగునాయుడు, షహనాజ్‌ సాదియ, సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, జిల్లాకేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి నాగ భూషణం, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్‌, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు, గాజువాక : లార్వా దశలోనే దోమలను నివారించాలని గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.సుధాకర్‌ సూచించారు. డెంగీ వ్యాధి నివారించాలని కోరుతూ గురువారం గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ టి.నాగప్పారావు, ఎంపిహెచ్‌ఎస్‌ జి.రాము, హాస్పటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️