రాఘవేంద్రుని దర్శించుకున్న డిఐజి సిహెచ్ వెంకటేశ్వర్లు

Dec 23,2023 15:08 #Kurnool

ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని బెటాలియన్ డిఐజి సిహెచ్ వెంకటేశ్వర్లు శనివారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీ మఠం ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యాలయ సిబ్బంది బిందు మాధవాచార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు ఆయనకు శేష వస్త్రంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎస్ఐ వేణుగోపాల్ రాజు ఆధ్వర్యంలో సిబ్బందితో తగిన భద్రత ఏర్పాటు చేశారు.

➡️