నోట్‌ పుస్తకాలు పంపిణీ

ప్రజాశక్తి-శింగరాయకొండ : జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శింగరాయకొండకు చెందిన షేక్‌ రేష్మ తన కుమారుడు షారిక్‌ఈషన్‌ పుట్టినరోజు సందర్భంగా శానంపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీకి చెందిన చిన్నారులకు మంగళవారం నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా రేష్మ మాట్లాడుతూ తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు ప్రతి సంవత్సరం చిన్నారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు ప్రభుత్వ పథకాలను అందు కొని బాగా చదువుకోవాలన్నారు. ఈ సందర్భంగా న్యాయ సేవా సహాయకుడు పంతగాని వెంకటేశ్వర్లు గిరిజన చిన్నారులకు విద్యాపరమైన సహాయ సహ కారాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️