తొట్టిగారిపల్లె పిహెచ్‌సిలో డిఎంహెచ్‌ఒ తనిఖీ

ప్రజాశక్తి-గోపవరం మండలంలోని తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగు ప్రధానమంత్రి మాతత్వ అభయాన్‌ సురక్షిత ప్రోగ్రాంను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.నాగరాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గర్భిణులు అందరికీ సరైన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు అందించి, ముఖ్యంగా కష్టతరమైన గర్భి ణులను గుర్తించి 102, 108 వాహనం ఉపయోగించుకొని, సరైన సమయంలో సరైన చికిత్సను అందించవలసిందిగా పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్స్‌కు ఆదేశించారు. వేసవిలో ఉషో ్ణగ్రత ఎక్కువగా ఉన్నందువలన వడదెబ్బ పైన ప్రజలకు అవగా హన కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ ప్రాముఖ్యతను తెలియజేసి ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు విలేజి హెల్త్‌ క్లినిక్‌, ఆరోగ్య కార్యకర్తలు దగ్గర అందుబాటులో ఉంచాలనా ఆదేశించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం గాంధీ నగర్‌లో జరుగు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సరైన సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ వి.మల్లేష్‌ బద్వేల్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం కోటవీధి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌, సౌమ్య, జిల్లా ఎపిడిమాలజిస్ట్‌ ఖజా వుద్దీన్‌, అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ వెంకట్‌ రెడ్డి, ఎంపీహెచ్వో కె.వి.ఎస్‌ ప్రసాద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బి.వెంగయ్య, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ కె.చంద్రావతి, విలేజి హెల్త్‌ క్లినిక్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️