అమలుకాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దు : సిపిఎం

May 9,2024 21:32

ప్రజాశక్తి -జియ్యమ్మవలస : అమలు కాని హామీలిచ్చే పార్టీలను నమ్మొద్దని, ప్రజల బాగుకోసం నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు మర్రాపు సూర్యనారాయణ కోరారు. కురుపాం నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పి.అప్పలనరసకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మండలంలోని బీజేపురం, గెడ్డతిరువాడ, ఇటిక కుందరతిరువాడ, కుదమ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్యపెట్టడం బాబుకు కొత్తేమీ కాదన్నారు. .రైతు సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూరంగి సీతారాం, మండంగి శ్రీను, మోహన్‌ రావు తదితర పాల్గొన్నారు.

పాలకొండ : అరుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. పాలకొండ పట్టణంలో ఇంటింటి ప్రచారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే సిపిఎంకు ఓటు వేయాలని, ఇండియా కూటమి బలపర్చిన పాలకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ప్రచారంలో సిపిఎం నాయకులు ఎ.సత్యనారాయ ణ, డి.దుర్గారావు, లక్ష్మి, సంతోష్‌, చందు చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట : మండల కేంద్రంలో సిపిఎం ప్రచారం చేపట్టింది. ఇండియా కూటమి సిపిఎం బలపర్చిన అరుకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పల నరసను, పాలకొండ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థి సవర చంటిబాబును అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌ అభ్యర్థి గుర్తు సుత్తీ, కొడవలి, నక్షత్రం ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దుడ్డుఖల్లు సర్పంచ్‌ జీలకర్ర సుందరమ్మ, మండల సిపిఎం కార్యదర్శి ఎ.భాస్కరరావు, జి.శ్రీరాములు, గంగాధర్‌, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

మక్కువ : మండలంలోని మూనంగిలో అరకు పార్లమెంటు సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు మద్దతుగా మండల సిపిఎం నాయకులు ప్రచారం చేశారు. ఇండియా బ్లాక్‌ బలర్చిన సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని, ఆయన గుర్తు సుత్తీ, కొడవలి, నక్షతంపై ఓటు వేయాలని అభ్యర్థించారు.

సాలూరు రూరల్‌.: ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు మర్రి శ్రీనివాస రావు కోరారు. మండలంలోని నారింజపాడు, ఎగువశింబి, కొత్తూరు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి తరుఫున అరకు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేయుచున్న పాచిపెంట అప్పలనరసకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

➡️