గుండెపోటుతో డ్రైవర్ మృతి

Nov 30,2023 10:51 #Kakinada
lorry driver died by heart ache

ప్రజాశక్తి-గండేపల్లి : గండేపల్లి మండలం నీలాద్రి రావుపేట శివారు బుధవారం అర్ధరాత్రి లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ వివరాలు మేరకు ఎన్టీఆర్ జిల్లా, కోడూరు మండలం, కుంటముక్కల గ్రామం, చెందిన సాహూ గోపి, (55) విజయనగరం టైల్స్ లోడ్ తో వెళ్తుండగా రాగంపేట శివారుకు వచ్చేసరికి, గుండెనొప్పి వస్తుంది అని లారీ పక్కకు తీసి కూలిపోయాడు. వెంటనే క్లీనర్ మరొక డ్రైవర్ దగ్గర్లో ఉన్న ఆదిత్య ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని లారీలోనే ఉంచి బంధువులకు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించినట్లు రోడ్డు సేఫ్టీ డ్రైవర్ సతీష్ తెలిపారు.

➡️