కుల కట్టుబాట్లతో కుటుంబం వెలి

Feb 4,2024 22:12
కుల కట్టుబాట్లతో కుటుంబం వెలి

ప్రజాశక్తి – సీతానగరంసభ్యసమాజం తలదించుకునేలా కులకట్టుబాట్లతో కుటంబాన్ని వేలివేసిన సంఘటన చినకొండేపూడిలో చోటు చేసుకుంది. వడ్డీలపేటలో సరిహద్దుల తగాదాలో కుల పెద్దలు రెండుసార్లు తగువు పెట్టారు. తగవులో బాధిత కుటుంబాన్ని పెద్దలు దూషించడంతో పాటు దౌర్జన్యంగా కొట్టడానికి సిద్ధమయ్యారు. అనంతరం కులంలో జరిగే మంచి చెడుల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అన్నారని బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగేరు సుబ్బమ్మ పిల్లలతో ఉమ్మడిగా కలిసి ఉంటున్నారు. సుబ్బమ్మ కుటుంబం కుల పెద్దల నుంచి న్యాయం జరగలేదని పోలీసులను ఆశ్రయించారు. కుల పెద్దలను కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారనే కారణంతో ఆ కుటుంబాన్ని కుల కట్టుబాట్లు పాటించాలని సంఘ బహిష్కరణ చేసి, కుల సంఘంలో ఉన్న అందరికీ చెప్పారు. వారితో మాట్లాడకుండా వారికి ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వకుండా వారి పిల్లలతోను, పెద్దలతోనూ బహిష్కరించిన కారణంగా సంబంధాలు నెరపరాదని పెద్దలు ఆదేశించారు. శనివారం బాధిత కుటుంబ సీతానగరం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️