త్యాగశీలి రమాబాయి అంబేద్కర్‌

Feb 7,2024 23:31
రమాబాయి అంబేద్కర్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం, తాళ్లపూడి
రమాబాయి అంబేద్కర్‌ త్యాగ శీలి అని పలువురు నాయకులు అన్నారు. రమాబాయి అంబేద్కర్‌ 126వ జయంతిని గోకవరం బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత, గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించారు. రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్‌, రత్నం ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకాధ్యక్షులు దారా ఏసురత్నం, పాటి రామారావు, ఏలేటి రాజారావు, దళిత మహిళా నాయకులు ఖండవిల్లి లక్ష్మి, పి.ప్రశాంతి, జువ్వల రాంబాబు, పాము బాబూరావు, ఉసురుమర్తి రామారావు, కోరుకొండ మురళీకష్ణ, జె.అబ్బులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్‌ సచివాలయం వద్ద అంబేద్కర్‌ ఫెడరేషన్‌ స్టూడెంట్స్‌ ఆధ్వర్యంలో రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి విజయలక్ష్మి హాజరై రమాబాయి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలోని మహిళలు రమాబాయి అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా హక్కులు లభించాయన్నారు. అంబేద్కర్‌ విజయం వెనుక రమాబాయి పాత్ర ఎంతో ఉందన్నారు. రమాబాయి గురించి ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం వున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆమె యొక్క జీవిత చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకొస్తామన్నారు.తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాలలో హెచ్‌ఎం దున్నా దుర్గారావు ఆధ్వర్యంలో రమాబాయి జయంతిని నిర్వహించారు. రమాబాయి త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..

➡️