పల్ల వెంకన్న నర్సరీలో నటుడు శ్రవణ్‌

Feb 8,2024 23:44
తెలుగు చిత్ర సీమ

ప్రజాశక్తి-కడియం
తెలుగు చిత్ర సీమలో సంచలన నటుడు శ్రవణ్‌ రాఘవేంద్ర గురు వారం కడియం పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. ఆయనకు నర్సరీ డైరెక్టర్‌ పల్ల వినరు ఘనంగా స్వాగతం పలికారు. నర్సరీని కలియ తిరిగి పలు మొక్కలను పరిశీలించారు. దేశ, విదేశీ మొక్కలతో కడియం నర్సరీలు శోభామయంగా ఉన్నాయన్నారు. టాలీవుడ్‌ దిగ్గజ నటులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వంటి టాప్‌ టెన్‌ హీరోల చిత్రాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. బిర్లా చిత్రం నుండి బాహుబలి వరకు హీరో ప్రభాస్‌తో నటించిన శ్రవణ్‌కు విభిన్న నటునిగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అటువంటి నటుడు శ్రవణ్‌ తన మిత్రబృందంతో కలిపి పల్ల వెంకన్న నర్సరీని తిలకించారు.

➡️