పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

Feb 18,2024 23:01
పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేలా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ ఆదివారం టిడిపి జిల్లా అధ్యక్షుడు కెఎస్‌.జవహర్‌, సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆదిరెడ్డి వాసుకు యుటిఎఫ్‌ వినతిపత్రం ఇచ్చారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ కార్యాచరణలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ను వారం రోజుల్లో రద్దుచేసి పాత పెన్షన్‌ పథకం అమలు చేస్తామని పాదయాత్రలో వైఎస్‌.జగన్‌ హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జవహర్‌ మాట్లాడుతూ ఈ అంశాన్ని తమ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.రూపస్‌రావు జిల్లా కార్యదర్శి కె.రమేష్‌బాబు, ఎన్‌.రవిబాబు, కెవిఎన్‌.ప్రకాశరావు పాల్గొన్నారు.

➡️