ముస్లిములకు అండగా ఉంటాం

Mar 24,2024 22:53
ముస్లిములకు అండగా ఉంటాం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంముస్లిం సోదరుల కృష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ వారికి అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు అన్నారు. స్థానిక దానవాయిపేటలోని మదీనా షాదీ ఖానాలో టిడిపి పార్లమెంట్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు మహబూబ్‌ జానీ ఆధ్వర్యంలో రంజాన్‌ మాసం సందర్భంగా ఆదివారం రాత్రి ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ, రెడ్డి మణేశ్వరరావు, మజ్జి రాంబాబు, నగర బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, వై.శ్రీను పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో ముస్లిములు చూపే త్యాగం, సహనం, దానం, టిడిపి హయాంలో రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిములకు రంజాన్‌ తోఫా ఇచ్చేవారమన్నారు. ఈ కార్యక్రమంలో ఛాన్‌ భాషా, అహ్మద్‌, బషీర్‌, అజీజ్‌, మహమ్మద్‌ ఖాన్‌ భారు, రబ్బానీ, ఫయాజ్‌, కమాల్‌, రఫిక్‌ రాజా, లిమ్రా బాషా పాల్గొన్నారు.

➡️