సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్స్‌ ధర్నా

Jan 26,2024 00:07
సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్స్‌ ధర్నా

ప్రజాశక్తి-చాగల్లు, గోకవరంతమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్స్‌ ఎపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన గురువారం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరువు భత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని నినాదాలను చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు డి.నాగేశ్వరరావు, కార్యదర్శి కెవిఎస్‌ఎన్‌.మూర్తి, ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దారు నిరంజన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు కె.సత్యవాణి, దాసరి నాగేశ్వరరావు వెత్సా గంగాధరం పాల్గొన్నారు. గోకవరం రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సభ్యులు తహశీల్దారు, ఎంపిడిఒ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దారు శ్రీనివాస్‌, ఎంపిడిఒ పద్మజ్యోతికి వినతిపత్రం అందజేశారు. యుటిఎఫ్‌ గౌరవాధ్యక్షుడు ఎస్‌.కుమార్‌, కార్యదర్శి డి.గంగాధర్‌ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎం రామకృష్ణారావు, పిల్లంగోరు పాపారావు, జె.గవర్రాజు, ఎం.చిన్నికృష్ణ, ఆర్‌సి.వర్మ, ఎస్‌.వెంకట్రావు, గుత్తుల అప్పారావు, తోట కృష్ణారావు, షేక్‌ బాషా, ఎఎస్‌ఎన్‌.మూర్తి, ఎండి షాజహాన్‌ పాల్గొన్నారు.

➡️