సూర్యచంద్రకు వైసిపి నాయకుల పరామర్శ

Feb 26,2024 23:31
జనసేన

ప్రజాశక్తి-గోకవరం
టిక్కెట్‌ రాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిని జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్రను స్థానిక వైసిపి నాయకులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడారు. మంచి భావజాలం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పాటంశెట్టి మూడు రోజులుగా దీక్ష చేపడుతున్నప్పటికీ, టిడిపి, జనసేన నాయకులు పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. టిడిపి, జనసేన పార్టీలను నమ్ముకున్న ప్రతిఒక్కరూ మోసపోతారు అనడానికి పాటంశెట్టి విషయంతో తేటతెల్లమైందన్నారు. పరామర్శించిన వారిలో వైసిపి నాయకులు సుంకర వీరబాబు, దాసరి చిన్నబాబు, సమ్మెట మోహన్‌, వరసాల ప్రసాద్‌, సుంకర రమణ, నరాలశెట్టి నర్సయ్య, సర్పంచ్‌ బత్తుల శ్రీను, అక్షింతల రాజా, తోలేటి రాంప్రసాద్‌,కర్రి సూరారెడ్డి, బత్తుల నానాజీ, అధికారి బుజ్జి, నల్లల బుజ్జి, వీర్ల వెంకటేష్‌, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

➡️