4వ విడత వైఎస్సార్ చేయూత పంపిణీ

Mar 9,2024 15:58 #East Godavari

ప్రజాశక్తి-కడియం : కడియం మండలానికి సంబందించి 4వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద  4154 మంది లబ్ధిదారులకు రూ. 7,78,87,500 రూపాయలు జమ చేయగా, ఇప్పటి వరకు గత నాలుగు విడతలుగా 15,444మంది లబ్ధిదారులకు రు.28.86 కోట్ల రూపాయలు అర్హులైన అక్క చెల్లెమ్మకి అందించడం జరిగిందని జిల్లా ఇంచార్జ్ మంత్రిచెల్లుబోయిన వేణు గోపాల కృష్ణపేర్కొన్నారు. శనివారం కడియం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోమంత్రి పాల్గొని లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వము మహిళల ఆర్ధిక సాధికారిత దిశగా ప్రాదాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ మనోజ్, వైసీపీ నాయకులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరజాల బాబు, తాడాల చక్రవర్తి ఈలి గోపాలం, దుళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు , లబ్ధిదారులు  పాల్గొన్నారు.

➡️