కార్మిక వాడల్లో ఎగిరిన ఎర్రజెండా

May 1,2024 23:28
కార్మిక వాడల్లో ఎగిరిన ఎర్రజెండా

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వాడల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. పోరాటి సాధించుకున్న హక్కుల రక్షణకు కార్మికులు నడుం బిగించాలని పలువురు పిలుపు ఇచ్చారు. రాజమహేంద్రవరం పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను హరిస్తున్న పాలకు లకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్‌ పిలుపునిచ్చారు. శ్యామల సెంటర్లో స్థూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌ ఆవిష్కరించారు. అనంతరం శ్యామలా సెంటర్‌ నుండి మెయిన్‌ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఆంధ్ర పేపర్‌ లిమిటెడ్‌ వద్ద సిఐటియు పతాకాన్ని పేపర్‌ మిల్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు టి.అరుణ్‌ ఎగరవేశారు. 10 కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా థియేటర్‌ వద్ద బిల్డింగ్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలోనూ, జాంపేట రిక్షా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోను, నందం గనిరాజు సెంటర్‌లో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోను, ఒఎన్‌జిసి బేస్‌ కాంప్లెక్స్‌ వద్ద, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ వద్ద, సదరన్‌ డ్రగ్స్‌ పరిశ్రమ వద్ద, సర్వారాయ బాటిలింగ్‌ యూనిట్‌ వద్ద, అంగన్వాడి, ఆశా కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇరిగేషన్‌ ఉద్యోగులు, మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌లతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిన వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి, కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఉపాధ్యక్షులు కర్రి రామకృష్ణ, పి.తులసి, ఎన్‌.సత్తిరాజు, శారద, సునీత, అన్నామణి, హవేల, దుర్గ, నాగమణి, లక్ష్మి, రాధ, విద్యాసాగర్‌, ఎస్‌.వెంకటేశ్వరరావు, ఐ.సుబ్రమణ్యం, ఎన్‌.రాజా, మురళి, తాతారావు, భాస్కర్‌, వి.రాము, గోపాల్‌, రణదీప్‌ తదితరులు పాల్గొన్నారు.రాజమహేంద్రవరం ప్రజాశక్తి ఎడిషన్‌ కేంద్రంలో సిపిఎం సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌ అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. మేడే విశిష్టతను వివరించారు. మేడే స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడిషన్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌, ఐద్వా సీనియర్‌ నాయకులు టి.సావిత్రి, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ హార్లిక్స్‌ ఫ్యాక్టరీ వద్ద సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు జెండాను ఆవిష్కరించారు. హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఆపరేటర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ కర్రి రామకృష్ణ, నాయకులు లాజర్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పడాల రామకృష్ణ, రుద్ర రామకృష్ణ, కె.రంగారావు, సి.హెచ్‌.లక్ష్మణరావు, సిహెచ్‌.రామకృష్ణ, డి.నారాయణ, బి.వెంకటేశ్వరులు, జెపి పాల్గొన్నారు. ధవళేశ్వరంలోని ఎర్రకొండపైన పడాల రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు. కర్రి రామకృష్ణ, వి.ప్యారీలింగం, కె.రంగారావు, ఆర్‌.రామకృష్ణ, సిహెచ్‌.రామకృష్ణ, డి.నారాయణ, డి.శ్రీను, ఎన్‌.సాయిప్రసాద్‌ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ్‌పురంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కె.ప్రకాష్‌ బాబు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి టిఎస్‌.కార్తిక్‌ పాల్గొన్నారు.నల్లజర్ల ప్రధాన కూడలిలో సిఐటియు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో సీనియర్‌ కార్మిక నాయకుడు మన్యం భాస్కరరావు జెండాను ఆవిష్కరించారు. మండలంలోని దూబచర్లలో అచ్యుత నాగరాజు, పోతవరంలో రాగోలు శ్రీనివాసరావు, అనంతపల్లిలో పాండ్రంకి సూరిబాబు, చోడవరంలో పి.త్రిమూర్తులు, తెలికిచర్లలో తెలగరెడ్డి శేషారావు, ఆవపాడులో అచ్యుత బాలాజీలు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరంకి నాగు, బొంగు వీరభద్రం, సింగవరపు భాస్కరరావు, బోళ్ల పవన్‌, పెనుమాక కృష్ణారావు, ముద్దన రామలింగేశ్వరావు, శ్రీరామ శ్రీనివాసరావు, మార్గాని రామమాణిక్యం, రాచూరి శ్రీను, పదిమి ఆదినారాయణ, బొర్రా పెద్దిరాజు, బత్తిన కిరణ్‌ పాల్గొన్నారు.ఉండ్రాజవరంలో తాడిపర్రు శ్రీసిద్ధి వినాయక భవన నిర్మాణ కార్మికుల సంఘం, మోర్త భవన నిర్మాణ కార్మికుల సంఘం, పలు గ్రామాలలో, ఆయా సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరవల్లి వెంకట సుబ్బారావు, పినిశెట్టి ప్రసాద్‌, అమ్మిన ప్రకాష్‌, ఎస్‌కె.వల్లి, చప్పిడి హనుమంతు, ఐసెట్టి విజయరాజు, అక్కిశెట్టి వీరేశ్వరరావు, దేవరపల్లి వినాయకుడు, అరిగెల సూరిపండు పాల్గొన్నారు. పెరవలి ఎస్‌బిఐ ఎదురుగా ఉన్న ఎస్‌సి కమ్యూనిటీ హాల్‌ భవనంలో పూరెల్ల ధనరాజ్‌ అధ్యక్షతన కేకు కట్‌ చేశారు. ఎంపిపి కె.సీతారామ్‌ప్రసాద్‌, ఎ.కృష్ణారావు, పంపన వెంకటేశ్వరరావు, కిరణ్‌, కంతేటి సుబ్బారావు, గుబ్బల గంగాధర్‌ పాల్గొన్నారు.తాళ్లపూడి సిఐటియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో తాళ్లపూడి బస్టాండ్‌ సెంటర్లో జరిగిన వేడుకల్లో నాయకులు దూళ్ళ గోపాలం ఎర్రజెండాను ఆవిష్కరించారు. వై.నరసింహమూర్తి మాట్లాడారు. అనంతరం భావన నిర్మాణ కార్మికులు గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రక్కిలంక, పెద్దేవంలో కార్మికులు పతాకావిష్కరణ అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. పైడిమెట్ట గ్రామంలో మోటార్‌ వెహికల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో మే డే వేడుకలు జరిగాయి.చాగల్లు మెయిన్‌ రోడ్డు వద్దనున్న సిఐటియు స్తూపం వద్ద జెండాను కంకటాల బుద్ధుడు ఆవిష్కరించారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జెండాను ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు కోట సూర్యారావు ఆవిష్కరించారు. ఆఫీస్‌ వద్ద ఉన్న జెండాను బిల్డింగ్‌ వర్కర్స్‌ అధ్యక్షుడు తంగేళ్ల కొండయ్య ట్రెజరర్‌ కల్లేపల్లి తాతారావు జెండాను ఆవిష్కరించారు. బాటిలింగ్‌ యూనిట్‌ వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జెండాలను ఆవిష్కరించారు. కెకె.దుర్గారావు, ఆశ కార్మికుల రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ, ఎస్‌కె.ఆదం, జి.సుబ్బారావు, బి.రమేష్‌, తంగెళ్ల కొండయ్య, కల్లేపల్లి తాతారావు, రామాంజనేయులు, మూర్తి పాల్గొన్నారు.దేవరపల్లి సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ జెండాను ఆవిష్కరించారు. టిపి లక్ష్మి అధ్యక్షతన సభ జరిగింది. మల్లిపూడి వెంకటలక్ష్మి, ఉండవల్లి కృష్ణారావు, పెనుమనేని సత్యనారాయణ, కె.రత్నాజీ, డి.వినాయక్‌, గుంటూరు వరలక్ష్మి, గుంటూరు రాజు, వేల్పూరు దుర్గారావు, పాముల శ్రీనివాస్‌, చిర్రా బాలరాజు, నీతి రాంబాబు, ఎం.రాంబాబు, లక్క శ్రీనివాసు, అయినపర్తి శ్రీనివాసరావు, వెంకట్రావు, కె.శివాజీ, ఎస్‌కె.మస్తాన్‌ పాల్గొన్నారు. గోపాలపురం సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో, హమాలీల యూనియన్‌ నాయకుడు సిరికొండ వీర్రాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఎస్‌కె.మస్తాన్‌ మాట్లాడారు. నాయకులు బేతాళ శ్రీనివాస్‌, సిఐటియు ఆశా వర్కర్లు యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఐ.మేరీ, కార్యదర్శి రామ తులసి, భవన నిర్మాణ కార్మికులు ప్రెసిడెంట్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు, సిఐటియు సభ్యులు, ఆశ వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, లారీ డ్రైవర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️